News March 27, 2025
ఎన్టీఆర్: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో MBA, MCA కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్(Y21-24 బ్యాచ్) రెగ్యులర్ & సప్లిమెంటరీ(థియరీ) పరీక్షలను ఏప్రిల్ 17 నుంచి నిర్వహించనున్నట్లు KRU వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలన్నారు. షెడ్యూల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 18, 2025
వేములవాడ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాల అందజేత

వేములవాడ ఏరియా ఆసుపత్రిని కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం సందర్శించారు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో సీఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన రూ.1.5 కోట్ల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్తోపాటు వైద్యశాఖ అధికారులతో కలిసి ఆ పరికరాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు.

తిరుపతి: రాష్ట్రపతి పర్యటన ఇలా..

తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 20న రానున్నారు. షెడ్యూల్ ఇలా..
➤20న 3.25PM: రేణిగుంటకు రాక
➤3.55PM: తిరుచానూరు ఆలయ దర్శనం
➤5.20PM: తిరుమలకు చేరిక
➤21న 9:30 AM: వరహాస్వామి దర్శనం
➤10AM: వేంకన్న దర్శనం
➤10:50AM: తిరుమల నుంచి పయనం
➤11:50AM: విమానాశ్రయం చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం.