News May 24, 2024

ఎన్టీఆర్: విధుల్లో అలసత్వం.. ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

విధులలో అలసత్వం ప్రదర్శించిన జగ్గయ్యపేట బాలికోన్నత పాఠశాల హెచ్ఎం ఎం. వాణి, విజయవాడ మొగల్రాజపురం BSRK హైస్కూల్ హెచ్ఎం ఎల్. రమేశ్‌ను DEO యూవీ. సుబ్బారావు తాజాగా సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకల కారణంగా వాణిని, విద్యాశాఖ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రమేశ్‌ను సస్పెండ్ చేసినట్లు DEO సుబ్బారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Similar News

News February 17, 2025

గన్నవరం: రేపు వల్లభనేని వంశీని కలవనున్న జగన్?

image

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ కలవనున్నట్లు తెలిసింది. బెంగళూరు నుంచి నేరుగా ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్ళనున్నారు. విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించినట్లు సమాచారం. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టై రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

News February 17, 2025

తోట్లవల్లూరు: ‘రేడియం స్టిక్కర్లు లేక ప్రమాదాలు’

image

తోట్లవల్లూరుల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కండక్టర్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్ మీద వెళ్తూ ఎడ్ల బండిని ఢీకొట్టడంతో స్పాట్‌లోనే మృతి చెందారు. ఎడ్ల బండ్లకు వెనుక రేడియం స్టిక్కర్స్ అంటించకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 16, 2025

తోట్లవల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

తోట్లవల్లూరు మండలం యాకమూరు రైస్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డ్యూటీ ముగించుకొని బైక్‌పై వస్తున్న ఆర్టీసీ కండక్టర్ చీకుర్తి సురేష్ (47) వెనుక వైపు నుంచి ఎడ్ల బండిని ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!