News September 17, 2024
ఎన్టీఆర్: వినాయక లడ్డు దక్కించుకున్న ముస్లిం దంపతులు
కంచికచర్ల మండలం గొట్టుముక్కలలోని వేణుగోపాల స్వామి ఎదురుగా ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డును సోమవారం రాత్రి వేలం వేశారు. అయితే వేలంపాటలో గ్రామానికి చెందిన షేక్ మొగలా సాహెబ్, మమ్మద్ దంపతులు వేలంలో పాల్గొని లడ్డూను రూ.27,116లకు దక్కించుకున్నారు. దీంతో విఘ్నేశ్వరుడు మతాలకు అతీతుడైన దేవుడని వీరు నిరూపించగా.. పలువురు వీరిని అభినందించారు.
Similar News
News October 5, 2024
రైతులు ఈ పంటను నమోదు చేయించుకోవాలి: కలెక్టర్
రైతులు ఈ పంటను నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. శనివారం గూడూరు మండలం రామరాజు పాలెం గ్రామ పరిధిలో జరిగే ఈ-పంట నమోదును కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో త్వరగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ధాన్యం విక్రయాలకు ఈ పంట నమోదు తప్పనిసరి అని చెప్పారు.
News October 5, 2024
నూజివీడు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి ట్రిపుల్ ఐటీలు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూర ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లేందుకు 45 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
News October 5, 2024
కృష్ణా: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.