News March 20, 2025
ఎన్టీఆర్: సింహాద్రి ఎక్స్ప్రెస్ రద్దు

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విజయవాడ మీదుగా గుంటూరు-విశాఖపట్నం మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్ప్రెస్లను దక్షిణ మధ్య రైల్వే రెండు రోజుల పాటు రద్దు చేసింది. ఈ మేరకు మార్చి 23,24 తేదీలలో గుంటూరు- విశాఖపట్నం(నం.17239), విశాఖపట్నం-గుంటూరు(నం.17240) సింహాద్రి ఎక్స్ప్రెస్ను మార్చి 24,25 తేదీలలో రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News November 24, 2025
ఇండియాలో చీపెస్ట్ కార్లు ఇవే..

1.మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు
2.మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3.రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4.టాటా టియాగో: రూ.4.57 లక్షలు
5.మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6.Citroen C3: రూ.4.80 లక్షలు
>పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్వే.
News November 24, 2025
RECORD: ఎకరం రూ.137 కోట్లు

TG: హైదరాబాద్ కోకాపేట్లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
News November 24, 2025
సింగూరు డ్యామ్ ఎందుకు దెబ్బతిందంటే!

నగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం ఇటీవల కాలంలో దెబ్బతింది. అధిక మోతాదులో నీటిని నిల్వ చేయడంతోనే ఈ సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలి. అయితే గత ప్రభుత్వం మిషన్ భగీరథ కోసం నిల్వలను పెంచాలని ఆదేశించింది. దీంతో 522 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తూ వస్తున్నారు. ఈ కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగి దెబ్బతింది. అందువల్లే మరమ్మతు చేయనున్నారు.


