News March 13, 2025
ఎన్టీఆర్: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ మీదుగా లింగంపల్లి(LPI)- కాకినాడ టౌన్(CCT) రైళ్లు ప్రయాణించే రూట్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.07445 CCT- LPI రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు, నం.07446 LPI- CCT రైలు ఏప్రిల్ 3 నుంచి జూలై 1 వరకు సికింద్రాబాద్ స్టేషనులో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లకు పై తేదీలలో చర్లపల్లిలో స్టాప్ ఇచ్చామన్నారు.
Similar News
News November 16, 2025
వేములవాడ: నో ఎంట్రీ.. డెవలప్మెంట్ వర్క్స్ ఎఫెక్ట్..!

వేములవాడ పట్టణంలోని వివిధ మార్గాలలో నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తోంది. ఆలయ అభివృద్ధి పనుల కోసం మెయిన్ రోడ్డు, బద్ది పోచమ్మ వీధి, జాతర గ్రౌండ్, పార్వతీపురం, వీఐపీ రోడ్డు ప్రాంతాలలో అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. దీనికి తోడు యాత్రికులు తమ వాహనాలను రోడ్ల పక్కన ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు నో ఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేశారు.
News November 16, 2025
పల్నాడు: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు

సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తారని చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు బయోడేటా, సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఈ నెల 25లోగా అందజేయాలన్నారు.
News November 16, 2025
చంద్రబాబూ.. ఇదేనా మీ విజన్: జగన్

AP: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు తక్కువగా ఉందని YS జగన్ ఆరోపించారు. 2025-26 FY తొలి 6 నెలల CAG గణాంకాలను Xలో షేర్ చేశారు. రెండేళ్ల కాలానికి పన్నుల వృద్ధి CAGR కేవలం 2.75% ఉండగా, ప్రభుత్వం పేర్కొంటున్న 12-15% వృద్ధి పూర్తిగా అవాస్తవమని విమర్శించారు. తమ హయాంలో పన్నుల వృద్ధి 9.87% ఉందన్నారు. కూటమి ప్రభుత్వ అప్పులు మాత్రం భారీగా పెరిగి రూ.2,06,959 కోట్లకు చేరాయని వెల్లడించారు.


