News March 13, 2025

ఎన్టీఆర్: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు అలర్ట్

image

విజయవాడ మీదుగా లింగంపల్లి(LPI)- కాకినాడ టౌన్(CCT) రైళ్లు ప్రయాణించే రూట్‌లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.07445 CCT- LPI రైలు ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు, నం.07446 LPI- CCT రైలు ఏప్రిల్ 3 నుంచి జూలై 1 వరకు సికింద్రాబాద్ స్టేషనులో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లకు పై తేదీలలో చర్లపల్లిలో స్టాప్ ఇచ్చామన్నారు.

Similar News

News July 9, 2025

దేవీపట్నంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

దేవీపట్నం మండలం పెద్దవుర గ్రామానికి చెందిన మిర్తివాడ రమణారెడ్డి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడని అతని సోదరి వీరవేణి తెలిపారు. యానాం సమీపంలో కోనవానిపాలెం గ్రామంలో రొయ్యల చెరువు వద్ద వారం రోజుల కిందట కూలి పనికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడన్నారు. యజమాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరుడి మృతిపై అనుమానం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 9, 2025

HYD: 2023 ప్రతిభ పురస్కారాలు.. ఎంపికైంది వీరే

image

ఎలనాగ(కవిత), ప్రభల జానకి(విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం), సంపత్ రెడ్డి(శిల్పం), రమేశ్ లాల్(నృత్యం), హరిప్రియ(సంగీతం), ప్రతాపరెడ్డి(పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ(నాటకం), పాపయ్య(జానపద కళ), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), మలయవాసిని(ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ(నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. వీరికి 19న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

News July 9, 2025

వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.