News March 9, 2025
ఎన్టీఆర్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

హోళీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా మాల్డా టౌన్(MLDT), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 18న MLDT- CHZ(నం.03430), ఈనెల 20న CHZ- MLDT(నం.03429) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గుంటూరుతో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 10, 2025
మల్యాల: మిస్సింగ్ అయిన మహిళ మృతి

మిస్సింగ్ అయిన ఓ మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్లో లభ్యమైంది. ఎస్ఐ నరేశ్ కుమార్ కథనం మేరకు.. మల్యాల మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన జైసేట్టి వెంకవ్వ(50) ఈ నెల 6న రాత్రి 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని భర్త గంగన్న ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదివారం జగిత్యాల మండలం అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో వెంకవ్వ మృతి చెంది కనిపించింది.
News March 10, 2025
రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళా

రేపు పరిగి పట్టణంలో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డీసీసీ కార్యదర్శి పెంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళవారం పరిగిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వికారాబాద్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని వెల్లడించారు.
News March 10, 2025
నేడు గ్రూప్-1 రిజల్ట్

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్లో జరిగిన మెయిన్స్కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.