News February 22, 2025
ఎన్టీఆర్: 1వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి- 2025లో నిర్వహించిన బీ.ఆర్క్ (ఆర్కిటెక్చర్ & ప్లానింగ్) 1వ సెమిస్టర్(5వ ఏడాది) రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని ANU పరీక్షల విభాగం సూచించింది.
Similar News
News March 26, 2025
పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు.
News March 26, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్: సీఎం రేవంత్

TG: బెట్టింగ్ యాప్స్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
News March 26, 2025
తిరుమల: టీటీడీ ట్రస్టులకు భారీగా పెరిగిన విరాళాలు

గడిచిన 9 రోజుల్లో వివిధ ట్రస్ట్‌లకు విరాళంగా రూ. 26.85 కోట్లు అందినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా తెలిపారు. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.4.88 కోట్లు అందినట్లు చెప్పారు. తాజాగా టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ 1.01 కోట్లు విరాళం అందినట్లు చెప్పారు.