News March 11, 2025
ఎన్టీఆర్: 30 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్(APSFC)లో కాంట్రాక్ట్ పద్ధతిన 30 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 11లోపు https://esfc.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవలసి ఉంటుందని.. అభ్యర్థులకు నిర్వహించే ప్రవేశపరీక్ష, ఉద్యోగాల అర్హతల వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడాలని విజయవాడలోని APSFC కార్యాలయ అధికారులు సూచించారు. SHARE IT.
Similar News
News December 16, 2025
ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సులు

యూపీ మథురలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో కాలిపోగా.. ఏడుగురు సజీవ దహనమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
News December 16, 2025
‘యూరియా యాప్’.. ఎలా పని చేస్తుందంటే?

TG: <<18574856>>యూరియా బుకింగ్ యాప్ను<<>> ప్రభుత్వం ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనుంది. ఫోన్ నంబర్, OTPతో లాగిన్ అయి ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. యూరియా బుక్ చేయగానే ఓ ఐడీ వస్తుంది. ఏ డీలర్ నుంచైనా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలు ఇవ్వాలి. వాటి ఆధారంగా అవసరమైన యూరియాను 15 రోజుల వ్యవధితో 1-4 దశల్లో అందజేసేలా ఏర్పాటు చేశారు.
News December 16, 2025
దేశంలో తొలి AAD ఎడ్యుకేషన్ సిటీ ప్రారంభించనున్న లోకేశ్

విజయనగరం జిల్లా భోగాపురంలో దేశంలోనే తోలి ఏవియోషన్ ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఏడ్యుకేషన్ సిటీని విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో నేడు లాంఛనంగా మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు. జీఎంఆర్-మాన్సాస్ అధ్యర్యంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు సమీపంలో 160 ఎకరాల స్థలంలో స్థాపించనున్నారు. ఈకార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొనున్నారు. ఇప్పటికే లోకేశ్ విశాఖకు చేరుకున్నారు.


