News March 11, 2025

ఎన్టీఆర్: 30 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ కార్పొరేషన్(APSFC)లో కాంట్రాక్ట్ పద్ధతిన 30 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 11లోపు https://esfc.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవలసి ఉంటుందని.. అభ్యర్థులకు నిర్వహించే ప్రవేశపరీక్ష, ఉద్యోగాల అర్హతల వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని విజయవాడలోని APSFC కార్యాలయ అధికారులు సూచించారు. SHARE IT.

Similar News

News March 17, 2025

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

News March 17, 2025

ధర్మవరం: చిగిచెర్ల వద్ద రోడ్డు ప్రమాదం. 

image

ధర్మవరం పట్టణంలోని మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బోయ నారాయణ స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించారు. అనంతపురం నుంచి చిగిచెర్ల మీదుగా ద్విచక్ర వాహనంలో వస్తుండగా చిగిచెర్ల వద్ద మరో వాహనం ఢీకొనడంతో నారాయణ స్వామి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నారాయణ స్వామి మృతి పట్ల కుటుంబ సభ్యులు బోరున విలపించారు.

News March 17, 2025

విశాఖ నుంచి HYD ట్రావెల్స్ బస్సులో మంటలు

image

విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాదం స్వల్పమే అయినప్పటికీ బస్సు నిలిపివేయడంతో ప్రత్యామ్నాయంగా రావాల్సిన బస్సు రెండు గంటలు కావస్తున్నా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా నక్కపల్లి హైవేపై చోటు చేసుకుంది. బస్సు వెళ్తుండగా వెనక చక్రాల డమ్ములు గట్టిగా పట్టేయడంతో స్వల్ప మంటలు చేలరేగాయి. ఈ ఘటన 9 గంటలకు జరిగింది.

error: Content is protected !!