News February 1, 2025
ఎన్టీఆర్: 67.38% మేర జరిగిన పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 67.38% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,29,914 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,54,926 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసింది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీ ప్రక్రియకు రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు.
Similar News
News February 1, 2025
పెద్దపల్లి: విద్యా కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ: కలెక్టర్
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఫిబ్రవరి 4న తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ రాష్ట్ర నూతన విద్య పాలసీ రూపకల్పన పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రాష్ట్ర విద్యా పాలసీ రూపకల్పన కోసం విద్యా కమిషన్కు బాధ్యతలు అప్పగించిందని, అభిప్రాయాలను విద్యా కమిషన్కు తెలియజేయాలని పేర్కొన్నారు.
News February 1, 2025
సిద్దిపేట: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్.. తుపాకులు అప్పగించండి: CP
గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ తుపాకులు పొందిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. లైసెన్స్ ఉన్న తుపాకులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ నెల 8లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా తీసుకువెళ్లవచ్చని చెప్పారు.
News February 1, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్లతో సీఈఓ వీడియో సమావేశం
శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. కలెక్టర్ తేజస్, అ.కలెక్టర్ పి. రాంబాబు, అధికారులు పాల్గొన్నారు.