News January 30, 2025
ఎన్టీఆర్: APCRDAలో 25 పోస్టుల భర్తీ.. అర్హులు ఎవరంటే?

CRDAలో డిప్యూటేషన్ విధానంలో 25 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA కమిషనర్ కన్నబాబు విజయవాడలో తన కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఫిబ్రవరి 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్సైట్ చూడాలన్నారు.
Similar News
News November 10, 2025
‘వనజీవి రామయ్య’ బయోపిక్కు భట్టికి ఆహ్వానం

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవానికి రావాలని చిత్ర దర్శకులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆహ్వానించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మొక్కల కోసం జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా తీయడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని ప్రశంసించారు.
News November 10, 2025
ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. నేరుగా లైసెన్స్!

AP: రాష్ట్రానికి 53 డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(DTC), 5 ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్ల(RDTC)ను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంజూరు చేసింది. 10 లక్షల జనాభాకు ఒకటి చొప్పున DTCలను పెట్టనుండగా RDTCలను ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒకటి చొప్పున, కోస్తాలో 3 ఏర్పాటు చేయనుంది. వీటిలో టూవీలర్, కార్లు, భారీ వాహనాల ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు.
News November 10, 2025
అందెశ్రీకి తీవ్ర అస్వస్థత

తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రచయిత అందెశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


