News January 30, 2025
ఎన్టీఆర్: APCRDAలో 25 పోస్టుల భర్తీ.. అర్హులు ఎవరంటే?

CRDAలో డిప్యూటేషన్ విధానంలో 25 పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA కమిషనర్ కన్నబాబు విజయవాడలో తన కార్యాలయం నుంచి ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని, ఫిబ్రవరి 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.
Similar News
News February 18, 2025
విడదల రజినీకి హైకోర్టులో ఊరట

AP: మాజీ మంత్రి విడదల రజినీకి హైకోర్టులో ఊరట దక్కింది. తన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రజినీ, ఆమె PAలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. YCP హయాంలో చిలకలూరిపేట టౌన్ CI సూర్యనారాయణ తనను హింసిస్తూ వీడియోను అప్పటి MLA రజినీకి చూపించారని పిల్లి కోటి అనే వ్యక్తి PSలో ఫిర్యాదు చేశారు. దీంతో రజినీ, PAలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
News February 18, 2025
యునెస్కో అంతర్జాతీయ సదస్సుకు పెద్దపల్లి బిడ్డ

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమెర గ్రామానికి చెందిన డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈనెల 24 నుంచి 26 వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సిల్వర్ జూబ్లీ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో యునెస్కో, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సహా 400 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
News February 18, 2025
విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో జూనియర్, సీనియర్ డిప్లొమా అభ్యర్థులు తమ పరీక్షా ఫీజును వచ్చే నెల 5వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.300 అపరాధ రుసుముతో పదవ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.