News January 23, 2025

ఎన్టీఆర్: APCRDAలో 8 పోస్టుల భర్తీ

image

CRDAలో డిప్యూటేషన్ విధానంలో 8 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. FEB 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని విజయవాడలోని CRDA కార్యాలయం నుంచి తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. 

Similar News

News September 18, 2025

కృష్ణా: ‘స్వచ్ఛతాహి సేవ’పై సమీక్ష

image

కలెక్టర్ డి.కె. బాలాజి గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమంపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, డ్వామా, రహదారులు-భవనాల శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం, ‘స్వచ్ఛతాహి సేవ’ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.

News September 18, 2025

నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

image

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

News September 17, 2025

కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

image

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్‌పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.