News January 23, 2025

ఎన్టీఆర్: APCRDAలో 8 పోస్టుల భర్తీ

image

CRDAలో డిప్యూటేషన్ విధానంలో 8 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నామని, ఈ పోస్టులకు రాష్ట్ర, కేంద్ర, PSUలలో పని చేస్తున్న వారు అర్హులని CRDA అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు NOC పత్రాలను https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. FEB 1లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని విజయవాడలోని CRDA కార్యాలయం నుంచి తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. 

Similar News

News February 18, 2025

గుడివాడ: కొడాలి నాని ఆసక్తికర్ వ్యాఖ్యలు

image

రెడ్ బుక్‌ గురించి తనకు తెలియదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నాం. మా ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు యాక్టివ్‌గా ఉండి ఏం చేయాలి’ అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. వంశీ అరెస్ట్ లాంటివి చిన్న చిన్న విషయాలని అన్నారు.

News February 18, 2025

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News February 18, 2025

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

error: Content is protected !!