News February 14, 2026

ఎన్టీఆర్: BA.LLB పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో డిసెంబర్ 2025లో నిర్వహించిన BA.LLB 9వ సెమిస్టర్(2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 18లోపు ఒక్కో పేపరుకు రూ.900 ఫీజు ఆన్‌లైన్‌లో http://www.onlinesbi.com/ వెబ్‌సైట్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

Similar News

News March 15, 2026

FLASH.. జమ్మికుంటలో రైలు పట్టాలపై తెగిపడిన తల

image

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు దూసుకెళ్లి తల, శరీరం వేర్వేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2026

16న కలెక్టరేట్‌లో PGRS

image

సోమవారం ఉ.10-మ.2 గంటల వరకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వొచ్చన్నారు. అర్జీల స్థితిపై 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, అర్జీలు Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News March 15, 2026

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

image

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.