News April 18, 2025
ఎన్టీఆర్: ‘MLA సీటు త్యాగం.. పది నెలలుగా ఎదురుచూపులు’

మాజీ మంత్రి దేవినేని ఉమ 2024 ఎన్నికలలో తన సిట్టింగ్ మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్‌కు ఇచ్చారు. కూటమి గెలుపు అనంతరం ఉమకు MLC, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారని వార్తలొచ్చినా చివరికి పదవి దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు పదవులు ఇవ్వాల్సి రావడంతో ఉమకు టీడీపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లోనైనా ఉమ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి.
Similar News
News December 18, 2025
మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.
News December 18, 2025
కరీంనగర్ డిఎంఅండ్ హెచ్‌వోకు ఆశా వర్కర్ల వినతి

ఆశా వర్కర్లకు క్షయవ్యాధి సర్వే పెండింగ్ బిల్లులు తక్షణమే అందించాలని కోరుతూ కరీంనగర్ డిఎంఅండ్ హెచ్వో కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డిసెంబర్ 18వ తేదీ నుండి లెప్రసీ సర్వే ప్రారంభం కానుందని జిల్లా సీఐటీయూ ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలత అన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సర్వే బిల్లులు చెల్లించాకే విధులకు హాజరవుతామని హెచ్చరించారు.
News December 18, 2025
చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


