News January 23, 2025
ఎన్‌టీఎస్ఈ స్కాలర్‌షిప్ పునరుద్ధరణ చేయాలి: తిరుపతి ఎంపీ
ప్రతిష్ఠాత్మకమైన జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టిఎస్‌ఇ) స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరించాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కి లేఖ రాశారు. ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.
Similar News
News January 23, 2025
ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలు
నెల్లూరు జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు రోజుకొక కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో రూ.4 వేలకుపైగా మద్యం కొనుగోలు చేసి ఫోన్‌పే ద్వారా నగదు పంపించాడు. అయితే డబ్బులు రాకపోవడంతో అనుమానించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News January 23, 2025
వివిధ రకాల ఉద్యోగాలకు మెరిట్ జాబితా విడుదల
నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ రకాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను spsrnellore.ap.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ ద్వారా తెలియపరచాలన్నారు.
News January 23, 2025
న్యూ ఢిల్లీలో కలిగిరికి చెందిన జవాన్ మృతి
న్యూఢిల్లీలో విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ లింగుంటి వెంకట నరసయ్య (41) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తెల్లపాడు గ్రామానికి చెందినవారు. ఇటీవల సంక్రాంతి పండగకు వచ్చిన ఆయన తిరిగి ఈనెల 20న న్యూఢిల్లీకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. జవాన్ మృతితో గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.