News March 26, 2025
ఎన్డీఏ ఎంపీల సమావేశానికి విజయవాడ ఎంపీ హాజరు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలోని పార్లమెంట్ సభ్యుల నియోజకవర్గాల సమస్యలు, కేంద్ర పథకాల అమలు, నిధుల అవసరాలను, తెలుసుకునేందుకు కేంద్రమంత్రులకు కొంతమంది ఎంపీలను గ్రూపులుగా అప్పగించి ప్రతి 3 నెలకు ఒకసారి సమావేశానికి ఆదేశించింది.
Similar News
News April 2, 2025
సిరిసిల్ల జిల్లాలోని ఉష్ణోగ్రతల వివరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గడిచిన 24 గంటలలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా నమోదు అయ్యాయి. వీర్నపల్లి 38.1 °c, సిరిసిల్ల 38.0°c, ఇల్లంతకుంట 37.6°c,రుద్రంగి 37.5 °c,కోనరావుపేట 37.4°c, తంగళ్ళపల్లి 37.3 °c, ఎల్లారెడ్డిపేట 35.0°c లుగా నమోదు అయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు మండలాలలో వాతావరణం స్వల్పంగా చల్లబడింది.
News April 2, 2025
సిరిసిల్ల: సర్దార్ పాపన్న పోరాటం మరువలేనిది: కలెక్టర్

బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం మరువలేనిదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సర్ధార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
News April 2, 2025
అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్ఎం శ్రీనివాస్ ప్రసాద్పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.