News May 27, 2024
ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో సమీక్షించిన అశోక్ గజపతిరాజు

జూన్ 4న జరగనున్న ఓట్లు లెక్కింపు ప్రక్రియ కోసం తీసుకోవాల్సిన చర్యలు గూర్చి కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు జిల్లాలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి ఆదివారం సాయంత్రం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థులైన కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకొని ఓట్లు లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
ఉపాధి హామీలో లక్ష్యాలు పూర్తి చేయాలి: VZM కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద రోజువారీ లక్ష్యాలను పూర్తి చేసి, ప్రతి కుటుంబానికి 100 రోజుల పనులు శాత శాతంగా అందించాల్సిన అవసరాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉపాధి పనులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, డ్వామా పథక సంచాలకులు, ఏపీడీలు, ఏపీవోలు, ఎంపీడీవోలతో మండల వారీ పురోగతిని సమీక్షించారు. పనిదినాలు, కనీస వేతనాలు, హాజరు శాతం వంటి అంశాలపై విశ్లేశించారు.
News November 15, 2025
ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి: ఎస్.కోట సీఐ

ఎస్.కోట అగ్నిమాపక కేంద్రంలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ (39) వెన్ను, కడుపునొప్పి తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు CI నారాయణ మూర్తి తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. సెలవుపై ఇంటిలోనే ఉంటున్నాడు. ఈనెల 13న పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అతని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
News November 15, 2025
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు: మంత్రి కొండపల్లి

విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్తో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆరంభించిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి భారీ స్పందన రావడం రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచిందన్నారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్తో పాటు వివిధ రంగాల వారీగా నిపుణులు సమ్మిట్లో పాల్గొన్నారన్నారు.


