News September 19, 2024
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.
Similar News
News December 18, 2025
AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.
News December 18, 2025
కడప జిల్లాలో అస్తి పన్ను బకాయిలు ఎన్ని రూ.కోట్లంటే.!

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్తి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. (రూ. కోట్లలో) KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.
News December 18, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారు- వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరులో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13230.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13172.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1990.00


