News September 19, 2024
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు
విజయవాడలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందరోజుల పాలనలో ప్రభుత్వం చేపట్టిన పనితీరుపై చర్చించారు.
Similar News
News October 4, 2024
కడప: ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో నేరుగా అడ్మిషన్లు
వైవీయూ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో నేరుగా ప్రవేశాలు (ఏ.పి.ఐ.సి.ఈ.టి-2024) కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ ప్రాంగణంలోని డీఓఏ కార్యాలయంలో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, రుసుంతో రావాలన్నారు.
News October 4, 2024
కడప: నూతన పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
కడప జిల్లాలో నూతన పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టి ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. దీనిపై వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో జేసీ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో మొత్తం ఇప్పటికే 1941 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 22 ప్రతిపాదనలు చేశామని, ఇందులో కడపలో 19, ప్రొద్దుటూరులో 1, కమలాపురంలో 2 కేంద్రాలు ఉన్నాయన్నారు.
News October 3, 2024
పెండ్లిమర్రి: పిడుగు పడి ముగ్గురు మృతి
పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.