News March 11, 2025

ఎన్నారై మహిళ మృతి కేసులో డాక్టర్‌కు రిమాండ్

image

విశాఖలోని మేఘాలయ హోటల్‌లో <<15708620>>ఎన్నారై మహిళ మృతి<<>> కేసులో డా.శ్రీధర్‌‌ను విశాఖ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అమెరికాలో ఫ్రీలాన్స్ డాక్ట‌ర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం అతను విశాఖ రాగా.. ఆ తర్వాత మహిళ కూడా వచ్చింది. వీరిద్దరూ ఒకే హోటల్ గదిలో ఉండగా.. ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి శ్రీధర్‌‌ను రిమాండ్‌కు తరలించారు.   

Similar News

News March 5, 2026

విశాఖ విచ్చేసిన మంత్రి నారా లోకేశ్

image

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మధ్యాహ్నం విశాఖ విచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరుకావడానికి లోకేశ్ వచ్చారు.

News March 5, 2026

ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

News March 5, 2026

విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

image

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.