News July 9, 2024
ఎన్నాళ్లీ.. చెట్ల కింద పాఠాలు

ఉరవకొండ పట్టణం శివరామిరెడ్డి కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు నేటికీ సొంత భవనం లేదు. ఏడాదిన్నర నుంచి పాఠశాలను స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాల నడుస్తున్న డీఆర్డీఏ భవనాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. పాఠాలు చెట్ల కింద చెబుతుండగా.. ప్రాంగణం ప్రహరీకి నల్లరంగులు వేసి బోర్డులుగా మార్చి బోధన సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రస్తుతం 1 నుంచి 4వ తరగతి వరకు 93 మంది విద్యార్థులు ఉన్నారు.
Similar News
News December 6, 2025
అనంతపురంలో రెజ్లింగ్ విజేత శ్రీ హర్షకు సన్మానం

ఇటీవల రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించిన శ్రీహర్షను అనంతపురంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. నార్పల మండలానికి చెందిన బాల శ్రీహర్ష బంగారు పతకం సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. గుజరాత్లో నిర్వహించే అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హర్ష ఎంపికయ్యారని తెలిపారు. అందులో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
News December 6, 2025
చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.
News December 6, 2025
580 మార్కులు సాధిస్తే విమాన విహారం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

పదో తరగతిలో 580 మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ వద్దకు తీసుకువెళ్లి విమాన విహారానికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం మోడల్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా టీచర్స్, పేరెంట్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.


