News March 24, 2024
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గౌతమి ఆదేశించారు. ఎస్పీ అన్బురాజన్‌తో కలిసి రాయదుర్గంలో ఆమె పర్యటించారు. జూనియర్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీకి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడ జరిగిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎక్కడా లోపం లేకుండా పనులు నిర్వహించాలన్నారు.
Similar News
News April 24, 2025
ఇన్‌స్టా ప్రేమ.. మోసపోయిన అనంతపురం యువతి!

ప్రేమ పేరుతో అనంతపురం యువతిని మోసం చేసిన వ్యక్తిపై హైదరాబాద్ SR నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనాథ్‌రెడ్డి వివరాల మేరకు.. అనంతపురం యువతికి SR నగర్‌లో ఉండే మురళి ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటల్‌కు తీసుకెళ్లాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News April 24, 2025
స్వచ్ఛతలో అనంతపురం జిల్లాకు అవార్డు

స్వచ్ఛ ఆంధ్ర అమలులో అనంతపురం జిల్లాకు అవార్డు దక్కింది. రాష్ట్రంలోనే తొలి స్థానంలో అనంతపురం, ద్వితీయ స్థానంలో సత్యసాయి జిల్లా నిలిచాయి. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణతేజ ప్రకటించారు. నేడు విజయవాడలో జరగనున్న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అవార్డును అందుకోనున్నారు.
News April 24, 2025
ఈతకు వెళ్లి బీఫార్మసీ విద్యార్థి మృతి

నెల్లూరు జిల్లాలో చదువుకుంటున్న అనంతపురం యువకుడు ఈతకు వెళ్లి మృతిచెందాడు. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన అంజి నార్త్ రాజుపాలెంలోని వేంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సమీపంలోని రేగడిచిలక వద్ద బావి దగ్గరికి ఐదుగురు విద్యార్థులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో బావిలో మునిగి చనిపోయాడు.