News April 5, 2024
ఎన్నికలకు భరోసా కల్పిస్తాం: ఎస్పీ
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు కవాతు నిర్వహించారని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు.
Similar News
News January 22, 2025
12వ రోజు 286 మంది అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్లో 12వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. 600 మంది అభ్యర్థులకు గాను 415 మంది అభ్యర్థులు బయోమెట్రిక్‌కు హజరయ్యారన్నారు. ఫైనల్ పరీక్షకు 286 మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఎస్పీ తెలిపారు.
News January 22, 2025
రూ.291.67 కోట్లతో కర్నూలు నగరపాలక అంచనా బడ్జెట్
కర్నూలు నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాల బడ్జెట్‌ను స్థాయీ సంఘం ఆమోదించింది. నగరపాలక కార్యాలయంలో మేయర్ బీవై రామయ్య అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశం బుధవారం నిర్వహించారు. రూ.291.67 కోట్లతో బడ్జెట్ రూపకల్పన చేశారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.201.22 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు.
News January 22, 2025
వచ్చే నెల 19 నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరి సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని సమావేశంలో తీర్మానించారు.