News February 8, 2025
ఎన్నికలకు ముందస్తు ప్రణాళిక సిద్ధం: ఖమ్మం సీపీ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సన్నద్ధంగా కావాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ పోలీస్ అధికారులకు సూచించారు. శుక్రవారం వీసీ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన అప్రమత్తంగా వుంటూ, నేరాల చరిత్ర ఉన్న రౌడీ షీటర్లు, ఎన్నికల్లో శాంతికి విఘాతం కలిగించే వారి జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
Similar News
News October 26, 2025
ఆచంట: ఆస్తుల పంపకాల్లో గొడవ.. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆచంట మండలం పెదమల్లంలో చోటుచేసుకుంది. ఆచంట పోలీసుల వివరాల ప్రకారం.. తూ.గో జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన బొలిశెట్టి నరసింహారాజు తన తాలూకా కుటుంబ ఆస్తులు పంపకాలు చేయడం లేదని మనస్థాపానికి గురయ్యారు. దీంతో నిన్న సాయంత్రం సరిహద్దులో ఉన్న పెద్దమల్లంలో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
శ్రీ చైతన్యలో స్కాలర్షిప్ టెస్ట్.. లాప్టాప్ బహుమతి

పేద విద్యార్థులకు ఫీజు రాయితీతో కార్పొరేట్ విద్య అందించేందుకు శ్రీ చైతన్య ఐఐటీ-జేఈఈ & నీట్ అకాడమీ స్కాలర్షిప్ టెస్ట్‌ను నవంబర్ 2న నిర్వహించనుంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతుంది. మొదటి బహుమతిగా లాప్టాప్, 2 నుంచి 10వ ర్యాంకు వారికి ట్యాబ్‌లు ఇస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వివరాలకు 98485 87584 నంబర్‌ను సంప్రదించాలని అకాడమీ డైరెక్టర్ రవికిరణ్ తెలిపారు.
News October 26, 2025
జూబ్లీహిల్స్‌లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్‌తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్’ అంతగా ఉండకపోవచ్చు.


