News February 4, 2025

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: దంతాలపల్లి MPDO

image

దంతాలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వివేక్ రామ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ అప్సర్ పాషా, సెక్రటరీలు మోడెం మధు, సృజన, నాగరబోయిన శ్రీధర్, సతీష్, అజయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News February 9, 2025

భార్యపై కోపంతో భర్త ఏం చేశాడంటే?

image

ఓ వ్యక్తి భార్యపై కోపంతో ఆమె పేరుపై ఉన్న బైక్‌పై చలానాలు వచ్చేట్లు ప్రవర్తించాడు. పట్నాకు చెందిన ఓ వ్యక్తి ముజఫర్‌పూర్‌కు చెందిన యువతి పెళ్లైన నెలన్నరకే విడిపోయారు. ఆ యువతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ ఆమెపై కోపంతో అత్తింటి వారు ఇచ్చిన బైక్‌ను భర్త ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ నడిపాడు. బైక్ ఆమె పేరుతో ఉండటంతో చలాన్లు ఆ యువతి ఫోన్‌కు వెళ్లేవి. చలాన్లు భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించారు.

News February 9, 2025

పార్వతీపురం మన్యం జిల్లాలో రిజర్వ్డ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా కల్లు గీత కార్మికులకు కేటాయించిన రిజర్వుడ్ మద్యం షాపులకు 60 దరఖాస్తులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపారు. మద్యం షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగిసిందని పేర్కొన్నారు. ఈ నెల 10 తేదీ ఉదయం 9 గంటలకు పార్వతీపురం కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపులు కేటాయించనున్నట్లు వివరించారు.

News February 9, 2025

ఒంటరిగా ఉంటున్నారా?

image

దీర్ఘకాలిక ఒంటరితనం శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ‘ఒంటరిగా ఉంటే.. మరణించే ప్రమాదం 29% పెరుగుతుంది. రోజుకు 15 సిగరెట్లు తాగడం కంటే ఎక్కువ ప్రమాదం. గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఎక్కువ. రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఆందోళన పెరుగుతుంది’ అని అధ్యయనాలు చెబుతున్నాయి.

error: Content is protected !!