News February 7, 2025
ఎన్నికలకు సిద్ధం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకీ సిద్ధం అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు.
Similar News
News December 13, 2025
కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ

హైదరాబాద్ వచ్చిన ఫుట్బాల్ స్టార్ మెస్సీ ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్లో జరుగుతున్న మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. కేవలం 250 మందికి మాత్రమే మెస్సీని కలిసే అవకాశం కల్పిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను కేటాయించారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియానికి బయల్దేరుతారు.
News December 13, 2025
రాహుల్ గాంధీతో ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఛార్టెడ్ ఫ్లైట్లో ఆయన హస్తినకు వెళ్తారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేపు కాంగ్రెస్ నిర్వహించనున్న నిరసనలో సీఎం పాల్గొంటారు.
News December 13, 2025
కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.


