News February 7, 2025
ఎన్నికలకు సిద్ధం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీకీ సిద్ధం అని బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. గురువారం వనపర్తిలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని అన్నారు.
Similar News
News March 23, 2025
ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్లలో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News March 23, 2025
అమ్రాబాద్: సహాయక చర్యలకు రూ.5 కోట్లు

దోమల పెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద సహాయ చర్యలకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసినట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడించారు. ఈ నిధులను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ విత్ డ్రా చేసి ఖర్చుపెట్టి అధికారాన్ని కల్పించారు. గత 28 రోజులుగా ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎస్పీ కలెక్టర్ అక్కడే ఉంటూ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.
News March 23, 2025
నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్‌పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్‌పల్లె, మదన్‌పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.