News April 10, 2025

ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: గ్యానేష్ కుమార్

image

ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత దేశంలోని మీడియా నోడల్ అధికారులు,సోషల్ మీడియా నోడల్ అధికారులు,జిల్లా పౌర సంబంధాల అధికారులపై ఉందని భారత ఎన్నికల ప్రధాన అధికారి గ్యానేష్ కుమార్ సూచించారు. న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమొక్రసి అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రంలో బుధవారం నోడల్, ఈ సోషల్ మీడియా నోడల్ అధికారి, డిపిఆర్ఓలకు ఒక రోజు శిక్షణ ఇచ్చారు.

Similar News

News October 30, 2025

మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

image

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.

News October 30, 2025

హుజూర్‌నగర్‌కు మూడు పేర్లు

image

హుజూర్‌నగర్‌కు పాతకాలంలో పురుషోత్తమపురి, పోంచర్ల అనే రెండు పేర్లు ఉండేవి. ఫణిగిరి గుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి వెలయడంతో ఈ ప్రాంతం పురుషోత్తమపురిగా పేరొందింది. ఆ తర్వాత ముత్యాలమ్మ (పోచమ్మ) దేవాలయం ఏర్పడటంతో పోంచర్లగా మారింది. నవాబుల పాలనలో దీనిని హుజూర్‌నగర్‌గా మార్చారు. ఈ రెండు ఆలయాలు నేటికీ ఈ ప్రాంత ఆధ్యాత్మికతకు చిహ్నంగా ఉన్నాయి.

News October 30, 2025

జనగామ: నేడు పాఠశాలలకు సెలవు

image

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటిస్తూ జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రేపు జరగాల్సిన ఎస్ఏ-1 పరీక్షలు నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ఆయా పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు.