News March 27, 2025

ఎన్నికలలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ

image

పల్నాడు జిల్లా వ్యాప్తంగా గురువారం ఎంపీపీ, ఉప సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికలలో ఎవరైనా అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

Similar News

News November 13, 2025

నిర్మల్ జిల్లాలో ఢీ అంటే ఢీ.. ఛాన్స్ ఎవరికి?

image

డీసీసీ పదవి కోసం నేతలు భారీగా అశలు పెట్టుకున్నారు. ఈ నేతల్లో లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
నిర్మల్ జిల్లాలో ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్, ఖానాపూర్‌‌కు చెందిన దయానంద్, భైంసా ఏఎంసీ ఛైర్మన్ ఆనంద్ రావు పటేల్ పేర్లు ప్రధానంగా డీసీసీ రేసులో వినిపిస్తున్నాయి. శ్రీహరి రావునే మళ్లీ కొనసాగించేలా పార్టీ పరిశీలిస్తోందని టాక్.

News November 13, 2025

వేములవాడ: ID కార్డులుంటేనే అనుమతి

image

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్న క్రమంలో ప్రధాన ఆలయ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. గురువారం నుంచి ప్రధాన ఆలయం పరిసరాల్లోకి గుర్తింపు కార్డులున్న వారిని మాత్రమే అనుమతించడానికి ఆలయ యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ అధికారులు గుర్తింపు కార్డుల జాబితాను సిద్ధం చేస్తున్నారు.

News November 13, 2025

ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

image

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.