News March 21, 2024
ఎన్నికలవేళ… జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు..

సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని పోలీసులు జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో జల్లెడ పట్టారు. రహదారులు, ప్రధాన కూడళ్ళలో వెళ్తున్న బస్సులు, లారీలు, కార్లు ,ఆటోలు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు నిర్వహించారు.
Similar News
News October 22, 2025
ఎర్రచందనం అనుకొని తనిఖీలు.. తీరా చూస్తే సండ్ర మొద్దులు..!

యాడికి మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొలిమిగుండ్ల నుంచి బుగ్గ మీదుగా యాడికికి వస్తున్న ఐచర్ వాహనాన్ని సీఐ ఈరన్న తన సిబ్బంది నిలిసి తనిఖీ చేవారు. అయితే అవి సండ్ర మొద్దులు అని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.
News October 22, 2025
ALL THE BEST

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం నీరజ తెలిపారు. చంద్రగిరిలో జరిగే అండర్-14 విభాగంలో బిందు, నందు, లక్ష్మి, కడపలో జరిగే అండర్-17 విభాగంలో జగదీశ్వరి ఎంపికయ్యారు. క్రీడాకారులను పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, బాలకృష్ణ, ఉమ, లలిత, వెంకటలక్ష్మి, మధుమాల, కమల, సువర్ణ అభినందించారు.
News October 22, 2025
సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.