News February 27, 2025
ఎన్నికలవేళ పోలింగ్ కేంద్రాల్లో పోలీస్ ఏర్పాట్లను పరిశీలించిన ఏసీపీ

రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామీయా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల భద్రత కోసం చేపట్టాల్సిన జాగ్రత్తలపై ఏసీపీ బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి వివరించారు.
Similar News
News February 27, 2025
తూ.గో : తీరని విషాదం నింపిన శివరాత్రి

ఆ ఐదుగురికి 20 ఏళ్లు దాటలేదు. శివరాత్రి రోజే వారిని మృత్యువు వెంటాడింది. రెండు వేరువేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. తాళ్లపూడి(M) తాడిపూడిలో పుణ్యస్నానానికి వెళ్లి పవన్(17), దుర్గాప్రసాద్(19), పవన్(19), ఆకాష్ (19), పడాల సాయి(19) ఐదుగురు గల్లంతై చనిపోయారు. ప్రతిపాడు(M) రాచపల్లి నుంచి పట్టిసీమకు వెళుతుండగా చిడిపి వద్ద ఆటో బోల్తాపడటంతో రమణ అనే వ్యక్తి చనిపోయారని పోలీసులు తెలిపారు.
News February 27, 2025
‘తెలుగు’కు దక్కిన గౌరవం

పక్క రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మనకు అక్కడి భాషల్లోనే నేమ్ బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, కుంభమేళాలో భాగంగా UPలోని చాలా ప్రాంతాల్లో తెలుగు బోర్డులు దర్శనం ఇచ్చాయి. ప్రయాగ్రాజ్కు వెళ్లే మార్గాల్లో, త్రివేణీ సంగమం వద్ద, కాశీలోనూ UP ప్రభుత్వం తెలుగుభాషలో బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో AP, తెలంగాణ నుంచి వెళ్లిన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు భాషకు దక్కిన గౌరవం అని పలువురు గర్వపడ్డారు.
News February 27, 2025
ఖమ్మం: ‘24 గంటలు సైలెన్స్ పీరియడ్ అమలు’

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు, రాజకీయ పరమైన సంక్షిప్త సందేశాలు పంపడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.