News April 30, 2024

‘ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ సహకరించాలి’

image

నల్గొండ పార్లమెంటు ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు లోకసభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి కోరారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులతో ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి చాంబర్లో సమావేశమయ్యారు. 

Similar News

News November 23, 2025

జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

image

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.

News November 23, 2025

నల్గొండ: పున్నా కైలాస్ నేత రాజకీయ నేపథ్యం

image

మునుగోడుకు చెందిన పున్నా కైలాస్ నేత ఓయూలో చదువుకునే సమయంలోనే రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఓయూ విద్యార్థి నేతగా.. విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్‌లో చేరి 2018, 2023లో మునుగోడు MLA టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. 2022 నుంచి TPCC ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

News November 22, 2025

BREAKING: నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్

image

డీసీసీ అధ్యక్షులను ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అదిష్ఠానం ప్రకటించింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతను నియమించింది. నల్గొండ డీసీసీకి పలువురు పోటీ పడినప్పటికీ మునుగోడుకు చెందిన పున్న కైలాష్ నేతనే డీసీసీ పదవి వరించింది.