News May 11, 2024
ఎన్నికలు బహిష్కరించిన అచ్యుతాపురం గ్రామస్థులు

దుమ్ముగూడెం: ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అచ్చుతాపురం గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. లక్ష్మీనగరం గ్రామం నుండి అచ్చుతాపురానికి వెళ్లే జిల్లా పరిషత్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు సైతం పూర్తిగా కుంగి రహదారి అధ్వానంగా మారిందని వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు.
Similar News
News November 17, 2025
లోక్ అదాలత్ ద్వారా 5838 కేసులు పరిస్కారం: CP

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్కు విశేష స్పందన లభించిందని, వీటి ద్వారా 5838 కేసులు పరిష్కారమయ్యాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా రాజీకి అవకాశం ఉండి పరిష్కరించిన 5838 కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసులు-605, ఈ పెటీ కేసులు -2583, డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు – 2650, సైబర్ కేసులు -195 పరిష్కరించడం ద్వారా రూ.92,45,636 బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు.
News November 17, 2025
ఖమ్మం డీసీసీ.. ఆ నలుగురిలో ఎవరో..?

ఖమ్మం DCC అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. భట్టి, పొంగులేటి వర్గాల నేతలు పీఠంపై కన్నేశారు. పార్టీ నిబంధనల కారణంగా కొత్తగా చేరిన వారికి అవకాశం లేకపోవచ్చు. 56 దరఖాస్తుల్లో నూతి సత్యనారాయణ గౌడ్, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, మద్ది శ్రీనివాస రెడ్డి, మానుకొండ రాధాకిషోర్ తుది జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవి ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.
News November 17, 2025
ఖమ్మం టీహబ్లో సాంకేతిక సమస్యలు!

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని తెలంగాణ హబ్(టీహబ్) ద్వారా 6.5 లక్షల మంది రోగులకు 127 రకాల ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కోటిన్నర విలువైన యంత్రాలు తరచుగా మొరాయిస్తుండటంతో, రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోయి చికిత్సలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం వెంటనే పాత యంత్రాల స్థానంలో కొత్త మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.


