News May 11, 2024
ఎన్నికలు బహిష్కరించిన అచ్యుతాపురం గ్రామస్థులు

దుమ్ముగూడెం: ఈనెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు అచ్చుతాపురం గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. లక్ష్మీనగరం గ్రామం నుండి అచ్చుతాపురానికి వెళ్లే జిల్లా పరిషత్ రోడ్డు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని అవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు సైతం పూర్తిగా కుంగి రహదారి అధ్వానంగా మారిందని వాపోయారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోలేదన్నారు.
Similar News
News February 14, 2025
ఖమ్మం ప్రధాన రహదారులు.. రక్తసిక్తం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినీ మేడారం జాతర, పలు మండలాల్లో ఆలయాల మహోత్సవాలతో గురువారం ఖమ్మం జిల్లాలో జనాల తాకిడి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు పదుల సంఖ్యలో దుర్మరణం చెందారు. అలాగే పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అకాల ప్రమాదాలతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 13, 2025
BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.
News February 13, 2025
మున్సిపాలిటీలకు టెన్షన్‌గా పన్ను వసూళ్లు

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.