News February 17, 2025
ఎన్నికలు: మేడ్చల్ జిల్లా అప్‌డేట్

మేడ్చల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 34 గ్రామ పంచాయతీల్లో 66,044 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 33,150 మంది పురుషులు ఉండగా, 32,898 మంది మహిళా ఓటర్లు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. 34 జీపీల పరిధిలో 320 వార్డులు ఉండగా, 320 పోలింగ్ కేంద్రాలను సైతం ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 17, 2026
అయినవిల్లి: విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి

అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు శ్రీను(43) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ విద్యుత్ తీగ తగిలి శుక్రవారం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు.. అదే గ్రామంలో వీధి దీపాలు వేసేందుకు కరెంటు స్థంభం ఎక్కి లైట్లు బిగిస్తుండగా 11కేవీ వైర్ తగిలి అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
News April 17, 2026
ADB: పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం మారనుంది. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాలకు అదనంగా మరో 4 నుంచి 5 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే, కొత్తగా ఒక లోక్‌సభ స్థానం కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైతే, జిల్లాలో కనీసం నలుగురు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం దక్కనుంది. దీంతో ఆశావహుల సంఖ్య పెరిగి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
News April 17, 2026
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.


