News February 1, 2025

ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి: సుదర్శన్ రెడ్డి

image

ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇతర సంబంధిత నోడల్ అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Similar News

News December 17, 2025

మగనూర్: ఓటేసిన శతాధిక వృద్ధురాలు

image

మాగనూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మాగనూరు మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు ఈశ్వరమ్మ (101)తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువతరం ఓటేసి రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు.

News December 17, 2025

హైదరాబాద్‌లో BJPకి అగ్ని పరీక్ష!

image

GHMC ఎన్నికల రణరంగంలో BJP ఉనికి ఇప్పుడు ఒక అగ్నిపరీక్షగా మారింది. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతూ ప్రజా సమస్యలను విస్మరించడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. ​నాయకత్వ లేమి, అగ్ర నేతల వర్గపోరు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను నిర్వీర్యం చేశాయి. 300 కొత్త వార్డుల పునర్విభజన అనే వ్యూహాత్మక చక్రబంధాన్ని ఎదుర్కోవడంలో BJP వెనుకబడింది. తక్షణమే ప్రజా సమస్యలపై పోరాటమే కమలానికి ఏకైక మార్గం.

News December 17, 2025

గొల్లపల్లి: శాంతియుతంగా కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికలు

image

జిల్లాలో మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీంనగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.