News February 1, 2025
ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి: సుదర్శన్ రెడ్డి

ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఇతర సంబంధిత నోడల్ అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Similar News
News February 9, 2025
BJPని గెలిపించాలి: MLA హరీశ్ బాబు

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు కోరారు. కాగజ్‌నగర్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీకి అందివచ్చిన అవకాశమని అన్నారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.
News February 9, 2025
కరప: పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

కరప మండలం కురాడకు చెందిన కేదాసి సూరిబాబు జి. బావారం వద్ద ఫోన్‌లో మాట్లాడుతుండగా మేడపాటి శ్రీనివాసరావు ఆటోలో వచ్చి సూరిబాబు పై కత్తితో దాడి చేయగా అతని ఎడమచేతి బొటన వేలు తెగిపడిపోయింది. భయంతో బాధితుడు సూరిబాబు పారిపోయాడు. అనంతరం నిందితుడు శ్రీనివాసరావు కత్తినక్కడ వదిలేసి ఆటోలో వెళ్లిపోయాడు. స్థానికులు క్షతగాత్రుడుని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై సునీత తెలిపారు.
News February 9, 2025
చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

తన కొడుకు నాగచైతన్యను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.