News April 28, 2024
ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి: ఎస్పీ సిద్ధార్థ కౌశల్

ఎన్నికల్లో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశించారు. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరులోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై ఆదివారం దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News December 18, 2025
వేంపల్లిలో మైనర్ బాలిక ప్రసవం

వేంపల్లిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక గర్భం దాల్చి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలికకు నొప్పులు రావడంతో పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రసవం చేశారు. ప్రస్తుతం బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 18, 2025
AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.
News December 18, 2025
కడప జిల్లాలో అస్తి పన్ను బకాయిలు ఎన్ని రూ.కోట్లంటే.!

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్తి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. (రూ. కోట్లలో) KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.


