News February 14, 2025

ఎన్నికల్లో ఉద్యోగుల సహకారం కీలకం: కలెక్టర్

image

ఎన్నికల్లో నిర్వహించిన ఉద్యోగుల సహకారం కీలకమని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతిని టీఎన్జీవో నాయకులు గురువారం కలిశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు తమ వంతు సహకారం అందిస్తామని కలెక్టర్‌కు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వండి: కలెక్టర్

image

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలు అందించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం అనకాపల్లి కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా సైనిక సంక్షేమ వింగ్ కమాండర్ చంద్రశేఖర్‌తో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. సైనిక సంక్షేమ భవన నిర్మాణకి 70 సెంట్లు భూమి కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. యుద్ధ వీరులకు 300 గజాలు ఇస్తామన్నారు.

News December 9, 2025

పాడేరు: ‘మ్యూటేషన్, రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలి’

image

రీసర్వే, మ్యూటేషన్ ప్రక్రియలో అలసత్వం చేయకుండా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీ పట్టా భూమి, ఆర్ఓఎఫ్ఆర్ భూమి, జిరాయితీ భూమిలో పంట పండించే ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అందేలాగా చూడాలని సూచించారు. రీసర్వే చేసినప్పుడు ప్రభుత్వ భూములు, D-పట్టా భూమి పూర్తిగా పరిశీలించి వెబ్ల్యాండ్ సబ్ డివిజన్ చేయాలన్నారు.

News December 9, 2025

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల ఎన్నికల ఈవీఎం గోదాంను కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం పలు రాజకీయ పార్టీల నాయకులతో కలిసి తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగానే దీనిని పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. గోదాంకు పటిష్ట భద్రత కల్పించాలని, నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీ అనంతరం ఆయన లాక్ బుక్‌లో సంతకం చేశారు.