News February 8, 2025

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్

image

ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎంత మంది వేస్తారో చూడాలి.

Similar News

News December 18, 2025

రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది: హరీశ్ రావు

image

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూశాక సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ ద్వారా విమర్శించారు. రోజురోజుకూ అధికారం చేజారిపోతుందనే సత్యం జీర్ణం కాక రేవంత్ అవాకులు చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. తన పతనం తప్పదనే భయంతోనే ప్రెస్ మీట్లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుర్చీ ఊడుతుందనే ఆందోళనలో రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

News December 18, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(SIT) దర్యాప్తు చేయనుంది. సభ్యులుగా 9 మంది అధికారులు ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు <<18541312>>లొంగిపోయిన<<>> సంగతి తెలిసిందే.

News December 18, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

☞పలాస ఎమ్మెల్యే శిరీషను కలిసిన ఆర్.నారాయణమూర్తి
☞సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే బగ్గు
☞శ్రీకాకుళం: డ్యూటీల పేరుతో మహిళా ఉపాధ్యాయులను వేదిస్తున్నారు
☞SKLM: ఈనెల 30న శ్రీకాకుళంలో తపాలా అదాలత్
☞రణస్థలం: ‘తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం’
☞ట్రక్ షీట్ల జారీపై జిల్లా జాయింట్ కలెక్టర్ సూచనలు
☞జిల్లాలో పలుచోట్ల ధనుర్మాసం పూజలు, నగర సంకీర్తనలు