News February 8, 2025

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన వాలంటీర్

image

ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శివ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తనను మొదటి ప్రాధాన్యత ఓటుకు గెలిపించవలసిందిగా గ్రాడ్యుయేట్స్‌ని అభ్యర్థిస్తున్నాడు. నామినేషన్లు పూర్తయ్యేలోగా ఇంకా ఎంత మంది వేస్తారో చూడాలి.

Similar News

News March 26, 2025

AB -PMJAY: గిగ్ వర్కర్స్‌కు గుడ్‌న్యూస్

image

గిగ్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ ప్రయోజనాలను అందించే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని లేబర్ మినిస్ట్రీ సెక్రటరీ సుమిత తెలిపారు. ‘గిగ్ వర్కర్స్‌కు ఆరోగ్య బీమా అందించాలి. ఆయుష్మాన్ స్కీమ్ కింద వారికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది’ అని వెల్లడించారు. దీంతో ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వర్కర్స్‌కు రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది.

News March 25, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పారపట్టి పనిచేసిన భద్రాద్రి కలెక్టర్ ✓ జూలూరుపాడు: ట్రాలీ బోల్తా.. పదిమందికి గాయాలు ✓ భద్రాచలం బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ✓ కొత్తగూడెంలో న్యాయవాది కార్లకు నిప్పు పెట్టిన దుండగులు ✓ సారపాకలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత ✓ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసన ✓ భద్రాచలం: ఎన్కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి ✓ పినపాక: స్కూల్‌లో ఆకతాయిలు నిప్పంటించారు.

News March 25, 2025

రానున్న 4 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

error: Content is protected !!