News April 25, 2024
ఎన్నికల్లో పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: విశాఖ కలెక్టర్
వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా అందరూ కలిసి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు ప్రాముఖ్యత తెలుసుకొని, ఓటర్ చైతన్యం, హోమో ఓటింగ్ విధానం అంశాలపై ఆయన ఈరోజు ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Similar News
News November 5, 2024
సింహాచలం: పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకోవచ్చు
సింహాచలం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయం పరిధిలో గల పంచ గ్రామాల్లో ఇళ్లకు మరమ్మతులు చేయించడం, పైఅంతస్తులు నిర్మించుకోవడం చెల్లదు. దీనిపై గతంలో కోర్టులు కూడా యథాతథస్థితిని ప్రకటించాయి. నిబంధనలు సడలిస్తూ దేవాదాయ శాఖ మెమో జారీ చేసింది. దీనిపై పంచ గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News November 5, 2024
విశాఖ: 734 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు నివేదిక
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీచర్ పోస్టులు అన్ని కేటగిరీల్లో కలిపి 734 ఖాళీలు ఉన్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపింది. వీటిలో జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో 625, మున్సిపల్ పాఠశాలల్లో 109 ఖాళీలు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ-తెలుగు) ఖాళీలు 205, ఉర్దూ 11 ఖాళీలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీలను తాజా నివేదికలో పొందుపరచలేదు.
News November 5, 2024
మాడుగుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు: చంద్రబాబు
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.