News March 21, 2024
ఎన్నికల్లో వీరికి పోస్టల్ బ్యాలెట్లు

పోలింగ్ జరిగే మే 13న అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. విద్యుత్, BSNL, పోస్టల్, టెలిగ్రామ్, దూరదర్శన్, AIR, స్టేట్ మిల్క్ యూనియన్, పాల సహకార సంఘాలు, హెల్త్, ఫుడ్ కార్పొరేషన్, RTC, అగ్నిమాపక, పోలీసులు, అంబులెన్స్, షిప్పింగ్, సమాచార, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంది.
Similar News
News November 4, 2025
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ.7,555

ఆదోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు నమోదయ్యాయి. పత్తి కనిష్ఠంగా రూ.4,000, గరిష్ఠంగా రూ.7,555 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ.6,666, ఆముదాలు రూ.5,940 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోళ్లలో తేమ శాతం పేరుతో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
News November 4, 2025
జిల్లా అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

జిల్లా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులనున ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్ఎస్, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, తాగునీరు, శానిటేషన్, వ్యవసాయం తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి, ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.
News November 3, 2025
13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు

13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ తెలిపారు. అక్టోబర్ 25న లీప్ యాప్లో అటెండెన్స్ మార్కు చేయని కారణంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 13 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


