News April 29, 2024

ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

image

పాల్వంచ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని ఏ.ఆర్.ఓలు, ఆర్డీవోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా మాట్లాడుతూ.. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News July 9, 2025

ఖమ్మం జిల్లాలో తగ్గిన ఎంపీటీసీ స్థానాలు

image

ఖమ్మం జిల్లాలో MPTCల సంఖ్య తేలింది. గత ఎన్నికల్లో 289 స్థానాలుండగా ప్రస్తుతం 284కు తగ్గాయి. జిల్లాలో కల్లూరు, ఎదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడటంతో సంఖ్య తగ్గింది. కల్లూరులో 5 స్థానాలు తగ్గటంతో 13 స్థానాలతో అధికారులు డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో కల్లూరులో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. అటు ఎదులాపురంలోని గ్రామాలన్నీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రావటంతో పెద్దగా MPTCల సంఖ్య మారలేదు.

News July 9, 2025

ఖమ్మం జిల్లా లక్ష్యం 35,23,300 లక్షలు

image

వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో 35,23,300 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం అటవీ శాఖ తరఫున 2,47,200, సత్తుపల్లి డివిజన్‌లో 3లక్షలు, ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలో 3,08,920, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో 2,41,740, కల్లూరులో 65వేలు, వైరాలో 50వేలు, ఏదులాపురంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఇంకా మిగతా శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి.

News July 8, 2025

ఖమ్మం: 15 పాఠశాలలకు రూ.12 కోట్ల నిధులు

image

ఖమ్మం జిల్లాలో 15 ప్రభుత్వ పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి అధికారులతో సమీక్షించారు. 15 పాఠశాలలను ఎంపిక చేసి, రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళితో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలన్నారు. ఇందుకోసం రూ.12 కోట్ల సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.