News May 24, 2024
ఎన్నికల కేసుల నుంచి చింతమనేనికి ఊరట

ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న దెందులూరు మాజీ MLA చింతమనేని ప్రభాకర్కు తాత్కాలిక ఊరట లభించింది. జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. వారి కదలికలపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీని కోర్టు ఆదేశించింది.
Similar News
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు రూ.1,100 కోట్లు.. నేడు చెక్కుల పంపిణీ

పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పరిహారం పంపిణీ ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.1,100 కోట్లు విడుదల చేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేయనున్నారు. జనవరిలో మిగిలిపోయిన వారికి, 41.15 కాంటూర్ పరిధిలోని మరికొన్ని గ్రామాలకు చెందిన నిర్వాసితులకు ఈ పరిహారం అందనుంది.
News November 1, 2025
ఫ్లై ఓవర్ పనుల జాప్యంపై కలెక్టర్ నాగరాణి ఆగ్రహం

తణుకు మండలం ఉండ్రాజవరం కూడలి వద్ద వంతెన నిర్మాణ పనుల జాప్యంపై భీమవరం కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జాప్యానికి కారణం ఏంటని నేషనల్ హైవే అధికారులను, గుత్తేదారుడి సహాయకుడిని ఆమె నిలదీశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
News November 1, 2025
మహిళలను వేధిస్తే సహించం: కలెక్టర్ హెచ్చరిక

గృహహింస, మహిళలపై లైంగిక వేధింపులను సహించేది లేదని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పిల్లలు లేని దంపతులు పిల్లలను దత్తత తీసుకునే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు.


