News March 21, 2024

ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలి: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. సీ విజిల్ ఫిర్యాదులను 100% పరిష్కరించాలని సూచించారు. గురువారం ఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి 4 రోజులు గడిచినా ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వీటిపై అధికారులు దృష్టి సారించాలని చెప్పారు.

Similar News

News December 14, 2025

శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రత్యేక చర్యలు: ఎస్పీ

image

శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాల్లో ప్రతిరోజూ పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామస్థులకు శాంతిభద్రతలు, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 14, 2025

క‌ర్నూలు అభివృద్ధే నాకు ముఖ్యం: మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు అభివృద్ధి కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వచ్చిన‌ట్లు రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూల్లో టీడీపీ క‌మిటీల ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. త‌న‌కు కర్నూలు అభివృద్ధే త‌ప్ప వేరే ఆలోచ‌న లేద‌న్నారు. పార్టీ క్యాడ‌ర్ ప్ర‌జ‌ల్లో ఉంటూ స‌మ‌స్య‌లు గుర్తించి ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే అభివృద్ధి ఎంతో జరుగుతుందన్నారు.

News December 14, 2025

కర్నూలు క్రీడాకారులను ఢిల్లీలో అభినందించిన ఎంపీ

image

న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను ఎంపీ నాగరాజు ఆదివారం అభినందించారు. అండర్-19 విభాగంలో పాల్గొంటున్న హేమలత, అండర్-17 విభాగంలో పాల్గొంటున్న శృతి, సిరి చేతన రాజ్, లహరి ఢిల్లీలో ఎంపీని కలిశారు. వారు పాల్గొంటున్న ఈవెంట్ల గురించి ఎంపీ అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.