News April 10, 2024

ఎన్నికల కోడ్.. అనపర్తిలో రూ.6.75 లక్షలు స్వాధీనం

image

అనపర్తికి చెందిన కాంట్రాక్టరు సతీష్‌ రెడ్డి అనపర్తి నుంచి కోటబొమ్మాళికి కారులో వెళ్తుండగా.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం వద్ద తనిఖీల్లో రూ.6.75 లక్షల నగదును మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును పోలీసులు తనిఖీ చేయగా.. రూ.6.75 లక్షల నగదు ఉంది. వాటికి సంబంధించిన ఎటువంటి రశీదులు, ఆధారాలు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ కె.గోవిందరావు తెలిపారు.

Similar News

News March 22, 2025

IPL: కాకినాడ కుర్రాడిపైనే దృష్టంతా!

image

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్రారంభమవుతుంది. మామిడికుదురు(M) గోకులమఠంలో పుట్టిన సత్యనారాయణరాజు ఐపీఎల్‌లో MI తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్‌లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రంజీ పోటీల్లో 8 మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కాకినాడలో ఉంటున్నాడు. ఈ కుర్రాడికి ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందేమో వేచి చూడాలి.

News March 22, 2025

తూ.గో: ఆరేళ్ల తర్వాత సంచలన తీర్పు

image

కామవరపుకోట(M) గుంటుపల్లి బౌద్ధాలయాల వద్ద 2019లో ప్రేమజంటపై దాడి జరిగింది. ఈక్రమంలో యువతిని హత్య చేశారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల(M) జి.కొత్తపల్లికి చెందిన సోమయ్య(22), గంగయ్య(20), నందివాడ(M) అరిశెల గ్రామానికి చెందిన నాగరాజును నిందితులుగా గుర్తించారు. వీరికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సుమా సునంద శిక్ష విధించారని ఏలూరు SP ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు.

News March 22, 2025

రాజమండ్రి: వివాహం కావడం లేదని ఆత్మహత్య

image

వివాహం కావడం లేదని మనస్తాపం చెంది హుకుంపేట D-బ్లాక్‌కు చెందిన ఉరిటి రామ సుబ్రహ్మణ్యం (45) ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తల్లి వెంకటలక్ష్మి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.

error: Content is protected !!